Sunday, May 8, 2016

నేను జోగాడుతున్నపుడు అమ్మని వంటగదిలో చూసా,
బడికి వెళ్తున్నపుడు అమ్మని వంటగదిలోనే చూసా,
కాలేజీకి వేళ్తునపుడు కూడా అమ్మని అక్కడే చూసా,
ఇప్పటికీ ఆఫీసుకి వేళ్తునపుడు అమ్మని అక్కడే చూస్తున్నా.....
ఎందుకు అమ్మ అక్కడే ఉంటుంది
బయటకి ఎప్పటికీ రాదా?
అమ్మ అక్కడే ఉంది కానీ ,నన్ను ప్రపంచానికి
ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది.
అక్షరాలు దిద్దిస్తూ ఆది గురువు అయింది.
లక్షణాలు నేర్పిస్తూ ఆత్మీయురాలు అయింది.
కన్నీరు తుడిచి బాధలు వింటూ స్నేహితుడు అయింది.
పుట్టకముందు నుండే నన్ను ప్రేమిస్తూ నిజమైన ప్రేయసి అయింది.
వంటగదిలో ఉంటూనే అమ్మ ఇన్ని పాత్రలు వేసింది.
మనం దేశాలు దాటి వెళ్ళినా అమ్మ అక్కడే ఉంటుంది వంటగదిలో ....
మాతృదినోత్సవ శుభాకాంక్షలు
»»»»» శ్రీ «««««

Thursday, January 21, 2016

మన పెదవులు ఒకసారి కలిస్తే చాలు 
అమ్మ అని పలుకగలవు 
కానీ అవే పెదవులు ఎన్నిసార్లు కలిసినా 
అమ్మ గొప్పతనాన్ని వర్ణించలేవు
నా మనసు ఒంటరిగా ఉన్నపుడు ఒక సందేహం వెంటాడుతూ ఉండేది.
జీవితం అంటే పూలపాన్పు కాదు ,పూలతో పాటు ముళ్ళు కూడా ఉంటాయ్ అని అందరూ అంటారు,
మరి నాకెందుకు పూలు తప్ప ఇంకేమి కనపడట్లేదు అని ?
ఇపుడిపుడే తెలుస్తోంది నా పాదాలకి ముళ్ళు తగలకుండా ఆపేస్తుంది నీ త్యాగాలు అని ,
నా ప్రతి సంతోషం వెనుక నీ చెమట చుక్కలు ఉన్నాయని,
నీ ఋణం తీర్చాలి అంటే ....
నా జీవితం మొత్తం ఏడ్చినా ఆ కన్నీటి చుక్కలు సరిపోవు.
నా జీతం మొత్తం ఇచ్చినా ఆ కాగితపు ముక్కలు సరిపోవు .
నా మనసు పిచ్చిగా రాసే ఈ రాతలు సరిపోవు.
నన్ను నీ భుజాలపై ప్రేమతో మోస్తున్నందుకు ,
నా జీవితంని నీ చెమటతో రాస్తున్నందుకు,
నా ప్రతి సంతోషంని నీ త్యాగంతో ఇస్తున్నందుకు,
Love u nana
నాన్నకు ప్రేమతో ....
అంకితం నా జీవితం ......
««««« శ్రీ »»»»»»

Saturday, September 21, 2013

hai friends due to busy i am unable to post new posts about mom.sry for this.as soon as possible i will start posting daily

thank u

Wednesday, March 20, 2013

కలలోనూ ఇలలోనూ
కలవరములలొనూ
కంటికి రెప్ప తాను
కన్నీటిని జారనీయదు

పేరుకే అమ్మ తాను
గుణములోన దేవత తాను
ఆమె ప్రేమ అపురూపం
ఆమె త్యాగం పరిపూర్ణం
ఆమె కరుణ సముద్రం
ఆమె కి తెలియనిది స్వార్ధం

ఆమె లేని ప్రాణకోటి లేదు
తను లేని ప్రపంచం లేదు
ఆమె లో కల్మషం లేదు
తనకున్న సహనం మరెవరికి లేదు

ఆమె పేరు అమృతం
ఆమె మనసు అధ్బుతం
ఆమె విలువ అమూల్యం
ఆమె జీవితం మనకి అంకితం

ఆమె మరెవరో కాదు అమ్మ

సమస్తం తనే

Monday, November 26, 2012

అమ్మ

చెదరని చిరునవ్వు
సడలని స్త్యర్యం
భూమాత సహనం

ఇవన్ని కలిసిన మధురమైన బొమ్మ
ఈ లోకం లోని ప్రతి అమ్మ