Saturday, September 21, 2013

hai friends due to busy i am unable to post new posts about mom.sry for this.as soon as possible i will start posting daily

thank u

Wednesday, March 20, 2013

కలలోనూ ఇలలోనూ
కలవరములలొనూ
కంటికి రెప్ప తాను
కన్నీటిని జారనీయదు

పేరుకే అమ్మ తాను
గుణములోన దేవత తాను
ఆమె ప్రేమ అపురూపం
ఆమె త్యాగం పరిపూర్ణం
ఆమె కరుణ సముద్రం
ఆమె కి తెలియనిది స్వార్ధం

ఆమె లేని ప్రాణకోటి లేదు
తను లేని ప్రపంచం లేదు
ఆమె లో కల్మషం లేదు
తనకున్న సహనం మరెవరికి లేదు

ఆమె పేరు అమృతం
ఆమె మనసు అధ్బుతం
ఆమె విలువ అమూల్యం
ఆమె జీవితం మనకి అంకితం

ఆమె మరెవరో కాదు అమ్మ

సమస్తం తనే

Monday, November 26, 2012

అమ్మ

చెదరని చిరునవ్వు
సడలని స్త్యర్యం
భూమాత సహనం

ఇవన్ని కలిసిన మధురమైన బొమ్మ
ఈ లోకం లోని ప్రతి అమ్మ

amma prema

కొందరి ప్రేమ కొంతకాలం
మరికొందరి ప్రేమ అవసరం తీరే వరకు
కానీ అమ్మ ప్రేమ కలకాలం
తన ప్రేమే మనలను నిలుపును చిరకాలం

Saturday, October 27, 2012


వృద్దాశ్రమాలు అతిధి గృహాలు అయ్యాయి
కన్న తల్లిదండ్రులు బరువయ్యారు
కన్న బిడ్డలు కన్నీటిని కానుకిస్తున్నారు.

కలకాలం కళ్ళలో పెట్టుకొని  చూసిన వారు
వారి చివరి దశ లో మనకి అవసరం లేకుండా పోతున్నారు.

చిన్న జబ్బు చేసిన కంటికి రెప్పలా కాచిన అమ్మ
తన అవసాన దశలో ఆసరా కోసం ఎదురు చూస్తుంది

తనకి చివరి దశ లో బందువులు ఎవరో తెలుసా కన్నీళ్ళు
అవును కన్నీరే


దయచేసి మీ అమ్మ నాన్న ని నిర్లక్ష్యం చేయకండి

AMMA

తెలుగు అక్షరాలు అ తో మొదలు,
మన జీవితాలు అమ్మ ప్రేమ తో మొదలు.

అక్షరాల కి తుది వుంటుంది
మన జీవితాలకి తుది వుంటుంది.

అమ్మ ప్రేమ కి మాత్రం అంతం వుండదు.

లవ్ యు అమ్మ